రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో నాగార్జున వెబ్ సిరీస్!
25-03-2021 Thu 17:53
- ఓటీటీ కంటెంట్ పై దృష్టి సారించిన నాగార్జున
- రెండు భారీ ప్రాజెక్టుల కోసం సన్నాహాలు
- వైల్డ్ డాగ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న నాగార్జున
- ఏప్రిల్ 2న రిలీజ్ కానున్న వైల్డ్ డాగ్

కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళుతున్న సినీ ప్రముఖుల్లో నాగార్జున ఒకరు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో 'ఓవర్ ది టాప్' (ఓటీటీ) కంటెంట్, వేదికలకు విశేష ప్రాధాన్యత పెరగడంతో నాగార్జున వాటివైపూ దృష్టి సారించారు. తాజాగా ఆయన రెండు భారీ ప్రాజెక్టులతో ఓటీటీ వేదికలపై సందడి చేయనున్నారు. వాటిలో ఒకటి రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో వస్తున్న వెబ్ సిరీస్ కాగా, మరొకటి 1980 నుంచి నేటి కాలం వరకు జరిగిన పరిణామాల ఆధారంగా నిర్మిస్తున్నారు. వీటికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.
ప్రస్తుతం నాగార్జున నటించిన 'వైల్డ్ డాగ్' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ యాక్షన్ మూవీలో దియా మీర్జా, సయామీ ఖేర్, అలీ రెజా, అతుల్ కులకర్ణి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.
ADVERTSIEMENT
More Telugu News
తెలంగాణలో తాజాగా 47 మందికి కరోనా పాజిటివ్
4 minutes ago

ఐదు భాషల్లో ఎన్టీఆర్ 30వ చిత్రం... కొరటాల శివ దర్శకత్వం... రౌద్రం ఉట్టిపడేలా స్పెషల్ వీడియో
1 hour ago

తాడేపల్లి చేరిన గన్నవరం వైసీపీ పంచాయితీ
2 hours ago
