ఛేజింగ్ లో ఇంగ్లండ్ ఆటగాళ్ల దూకుడు... 10 ఓవర్లలోనే 104 పరుగులు
20-03-2021 Sat 22:07
- అహ్మదాబాద్ లో చివరి టీ20
- 20 ఓవర్లలో 2 వికెట్లకు 224 రన్స్ చేసిన భారత్
- ఛేజింగ్ లో తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
- విరుచుకుపడిన మలాన్, బట్లర్

భారత్, ఇంగ్లండ్ మధ్య చివరి టీ20కి ఆతిథ్యమిస్తున్న అహ్మదాబాద్ మైదానంలో పరుగులు పోటెత్తుతున్నాయి. భారత్ విసిరిన 225 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ దీటుగా స్పందించింది. తొలి ఓవర్లోనే జాసన్ రాయ్ డకౌట్ అయినా... డేవిడ్ మలాన్, జోస్ బట్లర్ ధాటిగా ఆడుతుండడంతో స్కోరు బోర్డు వేగంగా ముందుకు కదిలింది. ఈ జోడీ విజృంభణతో ఇంగ్లండ్ 10 ఓవర్లలోనే 104 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 12 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 127 పరుగులు చేసింది. బట్లర్ 51, మలాన్ 64 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ విజయానికి ఇంకా 48 బంతుల్లో 98 పరుగులు చేయాలి. చేతిలో 9 వికెట్లున్నాయి.
ADVERTSIEMENT
More Telugu News
సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న అడివి శేష్ 'మేజర్'
46 seconds ago

హరీశ్ శంకర్ తో రామ్ సినిమా!
9 minutes ago

సముద్ర గర్భంలో పంచదార కొండలు... తాజా అధ్యయనంలో వెల్లడి
17 minutes ago

ముస్లింలు ఈ దేశాన్ని సుసంపన్నం చేశారు: ఒవైసీ
29 minutes ago

వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ ను పార్టీ నుంచి, పెద్దల సభ నుంచి పంపించేసే వాళ్లు: పవన్ కల్యాణ్
53 minutes ago

వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
59 minutes ago

రేవంత్ రెడ్డి ఒక లుచ్చా: మంత్రి మల్లారెడ్డి
2 hours ago
