పీపీఈ కిట్ వేసుకుని.. తలకు కర్చీఫ్ కట్టి.. సినిమాను తలపించిన అంబానీ ఇంటి ముందు సీన్ రీకన్ స్ట్రక్షన్

20-03-2021 Sat 12:45
NIA make Sachin Vaze wear PPE walk outside Ambani residence to recreate scene

అది ముంబైలోని ఓ వీధి.. శుక్రవారం రాత్రి టైం 8 గంటలు కావొస్తోంది.. రోడ్డంతా బ్లాక్ చేశారు. అంతా హడావుడిగా ఉంది. కారుపై ఓ వ్యక్తి నిలబడ్డాడు. అక్కడికి కొంచెం దూరంలో బిల్డింగ్ పై మరో వ్యక్తి నిలుచుని అంతా చూస్తున్నాడు. ప్రజలెవరూ బయటకు రావొద్దని ఆర్డర్.

టైం 10.40 గంటలైంది.. ఓ కారొచ్చి ఆగింది. అందులో నుంచి ఓ వ్యక్తి పీపీఈ కిట్ వేసుకుని కారు దిగి నడుచుకుంటూ వెళ్లాడు. ఒకట్రెండు సార్లు అలాగే చేశాడు. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ తంతంతా.. ఏదో సినిమా షూటింగ్ కోసం కాదు. ముకేశ్ అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాలున్న కారును పెట్టిన కేసులో నేరం ఎలా చేశాడో తెలుసుకునేందుకు చేసిన సీన్ రికన్ స్ట్రక్షన్ ఇది.  

అంబానీ నివాసం యాంటీలియా ముందు శుక్రవారం రాత్రి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), ఫోరెన్సిక్ అధికారులు.. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ అధికారి సచిన్ వాజేతో సీన్ రీకన్ స్ట్రక్షన్ చేశారు. ఇప్పటికే సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా సచిన్ వాజేకు దీనితో లింకులున్నాయని ఎన్ఐఏ నిర్ధారణకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం వాజేను తీసుకుని యాంటీలియా వద్దకు వచ్చారు.

కారులో పీపీఈ కిట్ వేయించి, తలకు హ్యాండ్ కర్చీఫ్ కట్టించిన అధికారులు.. సీసీటీవీ ఫుటేజీల్లో ఎక్కడి నుంచైతే వాజే నడిచినట్టు కనిపించిందో అక్కడి నుంచే మళ్లీ నడిపించారు. మళ్లీ అక్కడి నుంచి వెనక్కు రమ్మన్నారు. ఆ టైంలో వాజే కాస్త కళ్లు తిరిగి పడిపోయినట్టు చేశాడు. వెంటనే అధికారులు ఏమైందని అడగడంతో.. అంతా బాగానే ఉందని చెప్పాడు. ఆ తతంగాన్ని మొత్తం వీడియో తీశారు. ఇక, సీన్ రీకన్ స్ట్రక్షన్ జరుగుతున్న సమయంలో అటుగా వచ్చే వాహనాలు, మీడియా కెమెరాల లైట్లను అధికారులు బంద్ చేయించారు.

..Read this also
ఒకేసారి ఇద్దరు కుమారులు మ‌ర‌ణిస్తే డిప్రెష‌న్‌లోకి వెళ్లి.. మ‌హారాష్ట్ర సీఎంగా ఎదిగిన షిండే!
 • 1964 ఫిబ్ర‌వ‌రి 9న స‌తారా జిల్లాలో జ‌న్మించిన షిండే
 • జీవ‌నోపాధి నిమిత్తం థానే వ‌ల‌స వ‌చ్చిన కుటుంబం
 • ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ వ‌ర‌కే చ‌దివిన శివసేన నేత‌
 • 1980లో శివ‌సేన కార్య‌క‌ర్త‌గా స‌భ్య‌త్వం
 • 1997లో థానే కార్పొరేట‌ర్ ‌గా ఎన్నిక‌
 • 2004 నుంచి కొప్రి ప‌చ్‌ప‌క‌డీ నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా విజ‌యం


..Read this also
ఏక్‌నాథ్ షిండేనే మ‌హారాష్ట్ర సీఎం!.. దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!
 • శివ‌సేన శాస‌న‌స‌భాప‌క్ష నేత‌గా షిండే ఎన్నిక‌
 • సీఎంగా షిండే పేరును అధికారికంగా ప్ర‌క‌టించిన ఫ‌డ్న‌వీస్‌
 • శివ‌సేన ప్ర‌భుత్వంలో చేర‌బోమ‌ని వెల్ల‌డి
 • బ‌య‌టి నుంచే షిండే ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తిస్తామ‌న్న మాజీ సీఎం
 • షిండే ప్ర‌భుత్వాన్ని నిల‌బెట్టే బాధ్య‌త త‌మ‌దేన‌ని కీల‌క ప్ర‌క‌ట‌న‌

..Read this also
సంఖ్యా బలం మాకే ఉంది... గవర్నర్ ను కలిసి వివరించిన ఫడ్నవీస్, ఏక్ నాథ్ షిండే
 • మహారాష్ట్రలో ఆసక్తికరంగా రాజకీయాలు
 • ముంబయి వచ్చి ఫడ్నవీస్ ను కలిసిన ఏక్ నాథ్ షిండే
 • ఇరువురూ గవర్నర్ తో భేటీ
 • తాజా సమీకరణాలపై గవర్నర్ కు వివరణ


More Latest News
Dasara movie upadate
Telangana tentd class exams results released
Mantri Sridevi appointed as Telangana official language committee chairperson
maharashtra new cm eknath shinde gone to depression for so many months
Traffic in Bengaluru Humidity in Chennai Cost in Mumbai Hyderabad is better says KTR
Vishnu Vardhan Reddy fires on TRS
Itulu Maredumilli Niyojaka Vargam teaser released
England team announced
subway employee shot dead by customer after argument over too much mayo
maharashtra new sm is eknath shinde
Fadnavis and Shinde met governor
anthrax outbreak in kerala forest
peddireddy clarifies on kuppam ysrcp candidate for 2024 elections
Pawan Kalyan responds to five women charred to death in Sri Sathyasai district
vallabhaneni vamsi mohan skips ysrcp krishna district plenary in gannavaram
..more