పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ నుంచి 'కంటిపాప కంటిపాప' లిరికల్ విడుదల.. వీడియో ఇదిగో!

17-03-2021 Wed 17:40
advertisement

పవన్ కల్యాణ్ తాజా చిత్రం 'వకీల్ సాబ్' పై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రంలో పవన్ సరసన శ్రుతిహాసన్ నటిస్తోంది. ఇతర పాత్రల్లో నివేదా థామస్, లావణ్య త్రిపాఠి, అనన్య నాగళ్ల, అంజలి కనిపించనున్నారు.

ఇప్పటికే ఈ చిత్రానికి చెందిన రెండు పాటలను యూనిట్ విడుదల చేసింది. 'మగువ.. మగువ', 'సత్యమేవ జయతే' పాటలు విడుదలై ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకున్నాయి. కాసేపటి క్రితం మూడో పాటగా 'కంటిపాప.. కంటిపాప' అనే సాంగ్ ను విడుదల చేశారు. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజుకు చెందిన శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement