వచ్చే నెలలో భారత పర్యటనకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్
16-03-2021 Tue 09:59
- రిపబ్లిక్ డే వేడుకలకు హాజరు కాలేకపోయిన బోరిస్
- బ్రిటన్లో జరగనున్న జీ7 సదస్సుకు మోదీ
- అంతకంటే ముందే భారత పర్యటనకు బ్రిటన్ ప్రధాని

కరోనా వైరస్ కారణంగా భారత గణతంత్ర వేడుకలకు హాజరు కాలేకపోయిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వచ్చే నెలాఖరులో భారత్లో పర్యటించనున్నారు. ఈ మేరకు బ్రిటన్ కార్యాలయం తెలిపింది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగిన తర్వాత ఆ దేశ ప్రధాని తొలి విదేశీ పర్యటన ఇదే కావడం గమనార్హం.
ఈ పర్యటన ద్వారా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో యూకే అవకాశాలను మరింత మెరుగుపరుచుకోవచ్చని బ్రిటన్ భావిస్తోంది. ఈ ఏడాది జూన్లో బ్రిటన్లో నిర్వహించనున్న జీ7 సదస్సుకు మోదీ హాజరుకానున్నారు. అంతకంటే ముందే బోరిస్ జాన్సన్ భారత్ పర్యటనకు రానుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.
More Latest News
హైదరాబాదులో 'పక్కా కమర్షియల్' ప్రీ రిలీజ్ ఈవెంట్... ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి
4 hours ago
