రేపు విజయవాడలో ఓటు హక్కు వినియోగించుకోనున్న పవన్ కల్యాణ్
09-03-2021 Tue 15:43
- రేపు రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్
- విజయవాడలో పవన్ కు ఓటు
- పటమటలంక జడ్పీ హైస్కూల్లో ఓటు వేయనున్న పవన్
- ఉదయం 7 గంటల నుంచి 8 గంటల మధ్యన ఓటేయనున్న జనసేనాని

రేపు ఏపీ వ్యాప్తంగా పురపాలక, నగరపాలక సంస్థల ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల మధ్య ఓటు వేయనున్నారు. పవన్ కల్యాణ్ పటమటలంకలోని కొమ్మ సీతారామయ్య జడ్పీ బాలికల హైస్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఈ మేరకు జనసేన పార్టీ సోషల్ మీడియాలో వెల్లడించింది.
More Telugu News
నాని 'టక్ జగదీష్' విడుదల వాయిదా
11 minutes ago

‘ప్రిజనరీ’ బుద్ధితో జగన్ రాళ్లేయిస్తే... వాటిని గొప్ప నిర్మాణాలకు వాడుకోగల ‘విజనరీ’ చంద్రబాబు: నారా లోకేశ్
28 minutes ago
