ఓ ఇంటివాడు కాబోతున్న టీమిండియా పేసర్ బుమ్రా!
09-03-2021 Tue 12:25
- స్పోర్ట్స్ యాంకర్ సంజనాతో బుమ్రా పెళ్లి
- ఈ నెల 14, 15 తేదీల్లో గోవాలో వివాహం
- గతంలో బుమ్రాపై అనేక ఊహాగానాలు
- నటి అనుపమ పరమేశ్వరన్ తో ప్రేమాయణం అంటూ ప్రచారం
- ఖండించిన అనుపమ తల్లిదండ్రులు

ఇటీవల ఇంగ్లండ్ తో నాలుగో టెస్టు సందర్భంగా పేసర్ జస్ప్రీత్ బుమ్రా వైదొలగిన నేపథ్యంలో అతడి పెళ్లిపై ఊహాగానాలు మొదలయ్యాయి. టాలీవుడ్ నటి అనుపమ పరమేశ్వరన్ తో బుమ్రా పెళ్లి అంటూ ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని అనుపమ కుటుంబ సభ్యులు ఖండించడంతో అంతటితో తెరపడింది. అయితే బుమ్రా పెళ్లి వార్త మాత్రం నిజమేనని తేలింది.
అమ్మాయి ఎవరో కాదు... స్పోర్ట్స్ యాంకర్ గా పనిచేస్తున్న సంజనా గణేశన్. ఈ అమ్మడు గతంలో బుమ్రాను పలు సందర్భాల్లో ఇంటర్వ్యూ కూడా చేసింది. కానీ వీరి మధ్య ప్రేమాయణం సాగుతున్న విషయం మాత్రం చాలా గోప్యంగా వుంది. ఇక, వీరి పెళ్లి 14,15 తేదీల్లో గోవాలో జరగనుందట. దీన్నిబట్టి బుమ్రా ఇంగ్లండ్ తో టీ20, వన్డే సిరీస్ లకు అందుబాటులో ఉండడం కష్టమేననిపిస్తోంది. దీనిపై బుమ్రా నుంచి ఇంకా ప్రకటన రాలేదు.
More Telugu News
ఐ లవ్ పవన్ కల్యాణ్ గారు... ప్రకాశ్ రాజ్ తాజా వ్యాఖ్యలు
17 minutes ago

ఈసీ నిర్ణయానికి వ్యతిరేకంగా రేపు మమతా బెనర్జీ ధర్నా
21 minutes ago

కరోనా ప్రభావం... మళ్లీ పెరుగుతున్న నిరుద్యోగ రేటు
50 minutes ago

నవీన్ పోలిశెట్టికి పెరుగుతున్న డిమాండ్!
2 hours ago
