తెలంగాణ రాష్ట్ర టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా బిగ్ బాస్ భామ
08-03-2021 Mon 15:27
- దేత్తడి హారికకు ప్రచారకర్తగా అవకాశం
- నియామకపత్రం అందించిన టూరిజం కార్పొరేషన్ చైర్మన్
- తన నియామకం పట్ల హర్షం

బిగ్ బాస్-4 రియాలిటీ షోలో ఫైనల్ వరకు వచ్చిన హైదరాబాద్ అమ్మాయి దేత్తడి హారిక (అలేఖ్య హారిక) తెలంగాణ ప్రభుత్వం నుంచి గౌరవనీయమైన అవకాశం అందుకుంది. హారికను తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా ఈమేరకు నియామక పత్రాన్ని హారికకు అందించారు. ఇకపై, తెలంగాణ పర్యాటకానికి హారిక అధికారిక ప్రచారకర్తగా వ్యవహరించనుంది. దీనిపై హరిక హర్షం వ్యక్తం చేసింది.
More Telugu News
ఎన్టీయే నుంచి వైదొలగిన మరో ప్రాంతీయ పార్టీ
6 hours ago
