కొండ‌పై బంగారం దొరుకుతుండ‌డం‌తో ఎగ‌బ‌డ్డ జ‌నం.. వీడియో ఇదిగో

07-03-2021 Sun 12:24
advertisement

కాంగోలో ఇటీవ‌ల‌ ఓ కొండ‌పై బంగారం ఉన్న విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఈ విష‌యం తెలుసుకున్న స్థానికులు బంగారం దొరుకుతోంద‌న్న ఆశ‌తో ఒక్క‌సారిగా ఎగ‌బ‌డ్డారు. కొండ‌పై తవ్వుతూ బంగారాన్ని వెతుకుతూ, బంగారంపై ఉన్న మ‌ట్టిని క‌డుగుతూ స్థానికులు క‌న‌ప‌డ్డారు.

ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. సౌత్‌ కివు ప్రావిన్స్‌ లుహిహిలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. బంగారంలా క‌న‌ప‌డిన ప్ర‌తి రాయినీ సంచుల్లో నింపుకుని స్థానికులు వెళ్లారు. కొండ‌పై ఉన్న‌ మట్టిలో 60 నుంచి 90 శాతం బంగారం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలో ఆ మట్టిని చాలా మంది ఇంటికి తీసుకెళ్లి క‌డుక్కోగా, మ‌రి కొంద‌రు అక్క‌డే దాన్ని శుభ్రం చేసి అందులో బంగారం కోసం వెతికారు. దీంతో కాంగో మైనింగ్‌ శాఖ స్పందిస్తూ ఆ కొండపై బంగారాన్ని తవ్వుకోవడానికి ఎవ్వ‌రూ వెళ్ల‌కూడ‌ద‌ని నిబంధ‌న‌లు పెట్టింది.


Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement