హిందూపురంలో ఓ యువకుడి చెంప చెళ్లుమనిపించిన బాలకృష్ణ
06-03-2021 Sat 16:05
- హిందూపురంలో బాలకృష్ణ పర్యటన
- మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైనం
- 9వ వార్డు అభ్యర్థితో మాట్లాడుతుండగా వీడియో తీసిన యువకుడు
- వీడియో ఆపేయాలన్న బాలయ్య
- వినకుండా వీడియో తీసిన యువకుడు

నందమూరి బాలకృష్ణ ఆవేశం గురించి తెలిసిందే. ఆయన తనకు నచ్చని విషయాలపై తీవ్రంగా స్పందిస్తుంటారు. ఆ కోపంలో చెంపచెళ్లుమనిపించడం బాలయ్యకు అలవాటే! దీనిపై అనేక విమర్శలు కూడా వచ్చాయి. తాజాగా ఆయన హిందూపురంలో ఓ యువకుడిపై ఇలాగే చేయి చేసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బాలకృష్ణ హిందూపురం 9వ వార్డు అభ్యర్థితో మాట్లాడుతుండగా, ఓ యువకుడు వీడియో తీసే ప్రయత్నం చేశాడు. దాంతో బాలయ్య వీడియో రికార్డింగ్ ఆపేయాలని సూచించారు.
అయినప్పటికీ ఆ యువకుడు వీడియో తీయడం కొనసాగిస్తుండడంతో మండిపడిన బాలయ్య చెంపచెళ్లుమనిపించారు. దాంతో అక్కడున్న వాళ్లు స్పందించి... బాలయ్య స్టాప్ అన్నాడంటే ఆపేయాల్సిందే అని ఆ యువకుడ్ని సముదాయించే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు మీడియాలో ప్రముఖంగా ప్రసారమవుతోంది.
ADVERTSIEMENT
More Telugu News
తెలంగాణలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు
6 hours ago

తెలంగాణలో తాజాగా 29 మందికి కరోనా
7 hours ago

అల్మోరా ప్రాంతం నుంచి ఈ స్వీట్ తీసుకురమ్మని ప్రధాని మోదీ చెప్పారు: బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్
8 hours ago

రైలెక్కిన బస్సులు... వీడియో ఇదిగో!
8 hours ago

దావోస్ లో వరుస సమావేశాలతో సీఎం జగన్ బిజీ
9 hours ago

సంచలన పేసర్ ఉమ్రాన్ మాలిక్ కు టీమిండియాలో చోటు... దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కు జట్టు ఎంపిక
10 hours ago
