వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు స్వయంగా బీ ఫారం అందించిన సీఎం జగన్
04-03-2021 Thu 14:02
- ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు
- మార్చి 15న పోలింగ్
- నేడు నామినేషన్ల దాఖలుకు తుది గడువు
- క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసిన వైసీపీ అభ్యర్థులు

ఏపీలో ఈ నెల 15న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. 6 స్థానాల కోసం వైసీపీ తరఫున కరీమున్నీసా, సి.రామచంద్రయ్య, చల్లా భగీరథరెడ్డి, మహ్మద్ ఇక్బాల్, దువ్వాడ శ్రీనివాస్, బల్లి కల్యాణ చక్రవర్తి నేడు నామినేషన్లు వేయనున్నారు. ఈ క్రమంలో వారు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిశారు. వారికి సీఎం జగన్ స్వయంగా బీ ఫారాలు అందించారు. వైసీపీ అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను శాసనమండలి కార్యదర్శికి, ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేయనున్నారు. నామినేషన్ల దాఖలుకు నేడు తుది గడువు కాగా, నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 8 వరకు అవకాశం ఉంది.
More Telugu News
ఐసోలేషన్లోకి వెళ్లిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
5 hours ago

ఎన్టీయే నుంచి వైదొలగిన మరో ప్రాంతీయ పార్టీ
6 hours ago

టీకా కొరతను అధిగమించే దిశగా కేంద్రం కీలక అడుగులు
6 hours ago
