సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న నారా లోకేశ్!
04-03-2021 Thu 13:27
- ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాను
- గాజువాక నుంచి ప్రచారం
- మేనిఫెస్టో ప్రజలకు వివరించాను
- రోడ్ షోలో పాల్గొన్నానన్న లోకేశ్

టీడీపీ నేత నారా లోకేశ్ ఈ రోజు మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఆయన ట్వీట్లు చేశారు. 'మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖకు వెళ్లి ముందుగా సింహాద్రి అప్పన్న ఆశీర్వాదం తీసుకుని, గాజువాక నుంచి ప్రచారం ప్రారంభించాను. తెలుగుదేశం మేనిఫెస్టో ప్రజలకు వివరించి ఓటేయమని కోరాను. తర్వాత పోటీ చేస్తోన్న అభ్యర్థులతో కలిసి రోడ్ షోలో పాల్గొన్నాను' అని ఆయన చెప్పారు.
'తెలుగుదేశం హయాంలో విశాఖకు తీసుకువచ్చిన మెడ్ టెక్ పార్క్ లాంటి పరిశ్రమలు కరోనా కష్టకాలంలో దేశాన్ని ఏ రకంగా ఆదుకున్నది ప్రజలకు గుర్తుచేశాను. విశాఖ జిల్లా వ్యాప్తంగా యువతకు 73 వేలకు పైగా ఉద్యోగాలను అందించిన తెలుగుదేశం పార్టీని మునిసిపల్ ఎన్నికలలో గెలిపించమని ప్రజలను కోరాను' అని లోకేశ్ చెప్పుకొచ్చారు.
More Telugu News
నాని 'టక్ జగదీష్' విడుదల వాయిదా
17 minutes ago

‘ప్రిజనరీ’ బుద్ధితో జగన్ రాళ్లేయిస్తే... వాటిని గొప్ప నిర్మాణాలకు వాడుకోగల ‘విజనరీ’ చంద్రబాబు: నారా లోకేశ్
33 minutes ago
