తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ కొల్లూరికి కేటీఆర్ అండ!
28-02-2021 Sun 06:35
- 1969 నాటి తెలంగాణ ఉద్యమంలో డాక్టర్ కొల్లూరి కీలక పాత్ర
- గచ్చిబౌలిలోని ఓ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై కొల్లూరి
- తక్షణ సాయంగా సీఎం సహాయ నిధి నుంచి రూ. 10 లక్షల అందజేత
- త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ఈటల

వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు డాక్టర్ కొల్లూరి చిరంజీవికి మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. ఆయన ఆసుపత్రిలో విషమ పరిస్థితుల్లో ఉన్న విషయం తెలుసుకున్న కేటీఆర్ వెంటనే ఆయన కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు. కొల్లూరి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి తక్షణం రూ.10 లక్షలు అందించే ఏర్పాట్లు చేశారు. కేటీఆర్ స్పందించిన తీరుకు డాక్టర్ కొల్లూరి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
1969 నాటి తెలంగాణ ఉద్యమంలో డాక్టర్ కొల్లూరి కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను మరో మంత్రి ఈటల రాజేందర్ పరామర్శించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలోనూ పాల్గొన్న కొల్లూరి త్వరగా కోలుకోవాలని ఈటల ఆకాంక్షించారు.
More Telugu News
మోదీ హద్దులు దాటి మాట్లాడుతున్నారు: మమతా బెనర్జీ
19 minutes ago

యథార్థ సంఘటన ఆధారంగా రవితేజ కొత్త సినిమా!
40 minutes ago

ఉత్కంఠను రేకెత్తిస్తోన్న 'మేజర్' టీజర్!
1 hour ago

మమతా బెనర్జీ క్లీన్ బౌల్డ్ అయ్యారు: మోదీ
2 hours ago

అలా అంటున్నారంటే.. ఏడుకొండలవాడిపై విశ్వాసం లేదని జగన్ రెడ్డి ఒప్పుకుంటున్నట్టే కదా?: అచ్చెన్నాయుడు
2 hours ago
