పరస్పరం ఢీకొన్న కల్వకుంట్ల కవిత కాన్వాయ్ వాహనాలు... తప్పిన ముప్పు
25-02-2021 Thu 21:39
- జగిత్యాల జిల్లాలో కవిత పర్యటన
- కొండగట్టు అంజన్న క్షేత్రంలో పూజలు
- తిరుగుప్రయాణంలో ఘటన
- ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కారుకు స్వల్ప ప్రమాదం
- ఘటన సమయంలో సుంకే కారులోనే ప్రయాణిస్తున్న కవిత

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ప్రమాదం తప్పింది. ఇవాళ ఆమె జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. తిరుగుప్రయాణంలో కవిత కాన్వాయ్ లోని వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కారు స్వల్ప ప్రమాదానికి గురైంది. ఘటన జరిగిన సమయంలో కవిత ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కారులోనే ప్రయాణిస్తున్నారు. అయితే ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
కాగా, గత కొన్నిరోజులుగా పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్న కవిత ఇవాళ రాయికల్ మండలం కొత్తపేట గ్రామంలోని నాగాలయంలోనూ ప్రత్యేక పూజలు చేశారు. ఇక్కడి ఉత్సవ మూర్తులకు పంచామృత అభిషేకం నిర్వహించారు.
More Telugu News
విదేశీ టీకాలపై దిగుమతి సుంకం తొలిగింపు?
4 hours ago

45 ఏళ్లు పైబడిన సినీ కార్మికులకు, సినీ జర్నలిస్టులకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నాం: చిరంజీవి
6 hours ago

మహారాష్ట్రలో లాక్డౌన్పై రేపే నిర్ణయం!
6 hours ago

మిచెల్లీ ఒబామాతో నా స్నేహాన్ని ఈ విధంగా అర్థం చేసుకోవడం దిగ్భ్రాంతిని కలిగించింది: జార్జ్ బుష్
6 hours ago
