విశాఖ స్టీల్ ప్లాంట్ కు నవరత్న హోదా ఉంది: మోదీకి డి.రాజా లేఖ
23-02-2021 Tue 21:57
- ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి
- ఇది విశాఖ ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన అంశం
- ప్లాంటును పరిరక్షించేందుకు కేంద్రం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు

విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుపరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం దుమారం రేపుతోంది. ప్లాంటును కాపాడుకునేందుకు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. వారికి వివిధ పార్టీలు సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాయి.
మరోవైపు ఈ అంశంపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా స్పందించారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాశారు. విశాఖ స్టీల్ ప్లాంటు విశాఖ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందని చెప్పారు. ఈ సంస్థకు నవరత్న హోదా ఉందని అన్నారు. స్టీల్ ప్లాంటును రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని... ఇనుప గనులు కేటాయించలేదని చెప్పారు. సంస్థ నుంచి 100 శాతం పెట్టుబడి ఉపసంహరణకు తాము వ్యతిరేకమని తెలిపారు.
Advertisement 2
More Telugu News
మున్సిపల్ ఎన్నికలకు మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలంటూ దాఖలైన రిట్ పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు
3 minutes ago

ఏపీలో గడచిన 24 గంటల్లో 106 మందికి కరోనా నిర్ధారణ
44 minutes ago

చంద్రబాబు మున్సిపల్ ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఖరారు
54 minutes ago

Advertisement 3
స్టాక్ మార్కెట్: నేడు కూడా లాభాలే!
1 hour ago

'డి కంపెనీ' మోషన్ పోస్టర్ ను పంచుకున్న వర్మ
2 hours ago

82 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడతాం: మోదీ
3 hours ago

Advertisement 4