విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో 13 మంది ఉద్యోగుల సస్పెన్షన్!
23-02-2021 Tue 09:18
- అవినీతికి అలవాటు పడిన ఉద్యోగులు
- ఏసీబీ సోదాల అనంతరం పక్కా ఆధారాలు
- తక్షణమే విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ గుడిలో అవినీతికి అలవాటు పడిన 13 మంది ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. గుడిలో ఐదు రోజుల పాటు ఏసీబీ అధికారులు దాడులు చేసి, పలు కీలక పత్రాలను, అవినీతి ఆధారాలను గుర్తించి, ప్రభుత్వానికి నివేదికను ఇవ్వగా, భారీ అక్రమాలు జరిగినట్టు నిర్ధారించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సస్పెండ్ అయిన వారిలో ఐదుగురు సూపరింటెండెంట్ స్థాయి అధికారులు కూడా ఉండటం గమనార్హం.
ఇక వీరు దేవాలయం భూములు, షాపుల లీజు, దర్శనాల టికెట్ల అమ్మకం, చీరల అమ్మకం, అన్నదానం, ప్రసాదాల తయారీ వంటి అన్ని చోట్లా అవినీతికి పాల్పడినట్టు తేలడంతో, అందరినీ తక్షణమే విధుల నుంచి తొలగిస్తున్నట్టు దేవాదాయ శాఖ ప్రత్యేక కమిషనర్ అర్జున్ రావు, నిన్న రాత్రి ఆదేశాలు జారీ చేశారు.
Advertisement 2
More Telugu News
తెలంగాణలో కరోనా కేసుల అప్డేట్స్!
19 minutes ago

గన్నవరం విమానాశ్రయాన్ని కమ్మేసిన పొగమంచు.. గాల్లో చక్కర్లు కొట్టిన స్పైస్ జెట్ విమానం!
36 minutes ago

Advertisement 3
సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
2 hours ago

ఇతని తెలివికి ఆ అర్హత లేదు: ఆనంద్ మహీంద్రా
3 hours ago

ఆ కమిటీలో నేను లేను.. నారా లోకేశ్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు: వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి
12 hours ago

Advertisement 4