మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో.. మార్చి 10న సెలవు ప్రకటించాలి: కలెక్టర్లకు ఏపీ ఎస్ఈసీ ఆదేశం
22-02-2021 Mon 20:28
- వచ్చే నెల 10న మునిసిపల్ ఎన్నికలు
- ఆరోజున సెలవు ప్రకటించాలని ఆదేశించిన నిమ్మగడ్డ
- 12 నగర పాలికలు, 75 పురపాలికలకు ఎన్నికలు

ఏపీలో పంచాయతీ ఎన్నికలు ముగిసిపోయాయి. ఇప్పుడు మునిసిపల్ ఎన్నికల హడావుడి మొదలైంది. మార్చి 10న మునిసిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్లకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కీలక ఆదేశాలను జారీ చేశారు. ఎన్నికల నేపథ్యంలో మార్చి 10న సెలవు దినంగా ప్రకటించాలని ఆదేశించారు. పోలింగ్, కౌంటింగ్ (మార్చి 14) రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఇవ్వాలని తెలిపారు. ఈ రెండు రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలను ఉయోగించుకోవాలని చెప్పారు.
ఎన్నికలకు పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలపై పోలీసుశాఖ ప్రత్యేక దృష్టిని సారించాలని ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లతో ఈరోజు నిమ్మగడ్డ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో మొత్తం 12 నగర పాలికలు, 75 పురపాలికలకు ఎన్నికలు జరగనున్నాయి.
Advertisement 2
More Telugu News
భైంసాలో జరిగిన హింస ఏమాత్రం మంచిది కాదు: కిషన్ రెడ్డి
29 minutes ago

రవితేజ సినిమాలో 'గాలి సంపత్' నాయిక
57 minutes ago

Advertisement 3
ఇది మా సెంటిమెంట్ కు సంబంధించిన విషయం: విశాఖ ఉక్కుపై ప్రధాని మోదీకి మరోసారి లేఖ రాసిన సీఎం జగన్
1 hour ago

బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కు కరోనా పాజిటివ్
2 hours ago

ఓ ఇంటివాడు కాబోతున్న టీమిండియా పేసర్ బుమ్రా!
2 hours ago

బాలీవుడ్ హీరోతో కలసి ప్రభాస్ మల్టీ స్టారర్?
2 hours ago

Advertisement 4