పంచాయతీ ఎన్నికల ఫలితాలపై మంత్రి పెద్దిరెడ్డిని అభినందించిన సీఎం జగన్
22-02-2021 Mon 15:00
- ఏపీలో ముగిసిన పంచాయతీ ఎన్నికలు
- అత్యధిక స్థానాల్లో వైసీపీ మద్దతుదారుల విజయం
- విజయానికి కృషి చేశారంటూ పెద్దిరెడ్డిని ప్రశంసించిన సీఎం
- సీఎంపై ప్రజల్లో నమ్మకమే విజయానికి కారణమన్న పెద్దిరెడ్డి

ఏపీలో పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో మెరుగైన ఫలితాలు సాధించారంటూ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని సీఎం జగన్ అభినందించారు. అత్యధిక స్థానాల్లో వైసీపీ మద్దతుదారులు గెలిచేలా కృషి చేశారంటూ ప్రశంసించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కు మంత్రి పెద్దిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల హామీలు నెరవేర్చడం, సీఎం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడమే విజయానికి కారణాలు అని పెద్దిరెడ్డి వివరించారు.
మంత్రి పెద్దిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... ఏపీలో 13,095 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా 10,524 పంచాయతీలు వైసీపీ మద్దతుదారుల కైవసం అయ్యాయి. టీడీపీకి 2,063 పంచాయతీలు దక్కాయి. కాగా, పంచాయతీ ఎన్నికలు సాఫీగా జరిగుంటే 90 శాతం స్థానాలు వైసీపీ మద్దతుదారులే విజయం సాధించేవారని పెద్దిరెడ్డి పేర్కొన్నారు.
Advertisement 2
More Telugu News
జీడీపీ పెరుగుతున్నదంటే 'ఓహో' అనుకున్నాం... గ్యాస్, డీజిల్, పెట్రోల్ అనుకోలేదు!... సోషల్ మీడియాలో సెటైర్లు
30 minutes ago

Advertisement 3
సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
1 hour ago

ఇతని తెలివికి ఆ అర్హత లేదు: ఆనంద్ మహీంద్రా
2 hours ago

ఆ కమిటీలో నేను లేను.. నారా లోకేశ్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు: వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి
11 hours ago

బాక్సింగ్ నేర్చుకుంటున్న రాశిఖన్నా!
11 hours ago

Advertisement 4