కొత్త లుక్ లో ప్రభాస్ ఫొటోలు వైరల్.. ఆసక్తికర చర్చ
22-02-2021 Mon 11:55
- మూడు సినిమాల్లో నటిస్తూ తీరక లేకుండా ఉన్న ప్రభాస్
- ఆది పురుష్ సినిమా కోసం కొత్త లుక్?
- రాముడి పాత్ర కోసమే మీసాలు పెంచిన యంగ్ రెబల్ స్టార్

సాహో సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మూడు సినిమాల్లో నటిస్తూ తీరక లేకుండా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన నటిస్తోన్న రాధేశ్యామ్ సినిమా లుక్, టీజర్ విడుదలైంది. అందులో ప్రభాస్ లవర్ బాయ్ లుక్‌లో కనపడుతూ అలరించాడు. ఇంకా ఆయన చేతిలో సలార్, ఆదిపురుష్ సినిమాలూ ఉన్నాయి.
అయితే, ప్రభాస్ కొత్త లుక్ ఒకటి బయటకు వచ్చింది. సామాజిక మాధ్యమాల్లో ఇది విపరీతంగా వైరల్ అవుతోంది. ఇందులో ప్రభాస్ కోర మీసాలతో, కళ్లజోడు పెట్టుకుని ఉన్నాడు. ప్రభాస్ ఇలా కొత్త లుక్‌లో ఎందుకు కనపడుతున్నాడన్న చర్చ కొనసాగుతోంది.
ఆయన నటిస్తోన్న ఆదిపురుష్ సినిమాలోని రాముడి పాత్ర కోసమే ప్రభాస్ ఇలా మీసాలు పెంచాడని కొందరు భావిస్తున్నారు. ఆయన పాత లుక్‌లను కొత్త లుక్‌తో పోల్చుతూ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.
Advertisement 2
More Telugu News
గృహిణి కొన్న లాటరీకి కోటి రూపాయలు!
34 minutes ago

అక్కినేని హీరోతో 'ఉప్పెన' దర్శకుడు
1 hour ago

Advertisement 3
శివకాశిలో భారీ పేలుడు... ఆరుగురి మృతి
2 hours ago

స్టీల్ ప్లాంట్ పై నిర్ణయం మారదని మోదీ సంకేతాలు ఇచ్చారు... ఏపీ బీజేపీ నేతలు దీనికేం సమాధానం చెబుతారు?: గంటా
3 hours ago

చిత్తూరు జిల్లాలో మరో 21 కరోనా కేసుల నమోదు
3 hours ago

Advertisement 4