పుదుచ్చేరిలో కుప్పకూలిన కాంగ్రెస్ ప్రభుత్వం... సీఎం రాజీనామా!
22-02-2021 Mon 11:32
- బల నిరూపణలో నారాయణ స్వామి విఫలం
- రాజీనామా లేఖతో రాజ్ భవన్ కు పయనం
- సాయంత్రంలోగా నిర్ణయం తీసుకోనున్న గవర్నర్

పుదుచ్చేరి అసెంబ్లీలో కొద్దిసేపటి క్రితం జరిగిన బల నిరూపణలో వి. నారాయణ స్వామి ఓడిపోయారు. దీంతో దాదాపు నాలుగున్నర ఏళ్లకు పైగా పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయింది. బల నిరూపణలో ఓటమి చెందగానే, తన రాజీనామా లేఖతో నారాయణ స్వామి రాజ్ భవన్ కు పయనం అయ్యారు. తెలంగాణ గవర్నర్ గా ఉన్న తమిళిసై ప్రస్తుతం పుదుచ్చేరి తాత్కాలిక గవర్నర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఆమె ప్రస్తుతం పుదుచ్చేరి రాజ్ భవన్ లోనే ఉన్నారు. మరికాసేపట్లో ఆమెను కలవనున్న నారాయణ స్వామి తన రాజీనామా లేఖను సమర్పించనున్నారు. ఆపై అసెంబ్లీలో ఇతర పార్టీల బలాబలాలను, న్యాయ నిపుణుల సలహాలను స్వీకరించిన తర్వాత గవర్నర్ తమిళిసై, తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
Advertisement 2
More Telugu News
అశోక్ గజపతిరాజు నన్ను కొట్టలేదు... మంటలు చెలరేగితే నన్ను కాపాడారు: టీడీపీ మహిళా కార్యకర్త
10 minutes ago

ఏపీలో కొత్తగా 74 కరోనా పాజిటివ్ కేసులు
47 minutes ago

Advertisement 3
50 శాతం రిజర్వేషన్ల అంశంపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అభిప్రాయాలు కోరిన సుప్రీంకోర్టు
1 hour ago

ఐదు కోట్లా? అసలు ఎవరిస్తారు నాకు?: తాప్సీ
1 hour ago

Advertisement 4