దుబాయ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న మహేశ్ బాబు 'సర్కారు వారి పాట'
21-02-2021 Sun 21:48
- పరశురామ్ దర్శకత్వంలో మహేశ్ 27వ చిత్రం
- దుబాయ్ లో గత నెలరోజులుగా షూటింగ్
- మహేశ్ బాబు, కీర్తి సురేశ్ లపై సన్నివేశాల చిత్రీకరణ
- తదుపరి షెడ్యూల్ గోవాలో..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, పరశురామ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం సర్కారు వారి పాట. ఈ చిత్రం తాజాగా దుబాయ్ లో చిత్రీకరణ పూర్తి చేసుకుంది. దుబాయ్ లో పలు యాక్షన్ సీక్వెన్స్ లతో పాటు మహేశ్ బాబు, హీరోయిన్ కీర్తి సురేశ్ లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. మహేశ్ అండ్ కో గత నెల రోజులుగా దుబాయ్ లో ఉంటూ షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసింది. ఇక సర్కారు వారి పాట తదుపరి షెడ్యూల్ గోవాలో ఉంటుందని తెలుస్తోంది.
మహేశ్ బాబు కెరీర్ లో ఈ చిత్రం 27వది. సామాజిక ఇతివృత్తాన్ని కథాంశంగా తీసుకుని ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లతో పాటు మహేశ్ బాబుకు చెందిన జీఎంబీ ఎంటర్టయిన్ మెంట్ కూడా ఈ చిత్ర నిర్మాణంలో పాలుపంచుకుంటోంది.
Advertisement 2
More Telugu News
ఏపీలో కొత్తగా 74 కరోనా పాజిటివ్ కేసులు
1 minute ago

50 శాతం రిజర్వేషన్ల అంశంపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అభిప్రాయాలు కోరిన సుప్రీంకోర్టు
31 minutes ago

ఐదు కోట్లా? అసలు ఎవరిస్తారు నాకు?: తాప్సీ
35 minutes ago

Advertisement 3
Advertisement 4