అటు వైసీపీ, ఇటు టీడీపీ... పంచాయతీ ఫలితాల నేపథ్యంలో పార్టీ ఆఫీసుల వద్ద ధూంధాం
21-02-2021 Sun 21:13
- ఏపీలో పంచాయతీ ఎన్నికలు పరిసమాప్తి
- నేడు నాలుగో విడత పోలింగ్
- వైసీపీ, టీడీపీ భారీ సంబరాలు
- మెరుగైన రీతిలో స్థానాలు వచ్చాయంటూ వేడుకలు

ఏపీలో పంచాయతీ ఎన్నికల క్రతువు ముగిసింది. ఇవాళ చివరిదైన నాలుగో విడత పోలింగ్ ముగియగా, ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో, అధికార వైసీపీ, విపక్ష టీడీపీ పోటాపోటీగా సంబరాలకు తెరదీశాయి. తాడేపల్లిలోని ప్రధాన కార్యాలయం వద్ద వైసీపీ, మంగళగిరి పార్టీ ఆఫీసు వద్ద టీడీపీ ధూంధాం చేశాయి. భారీ ఎత్తున బాణసంచా పేల్చి వేడుకలు జరుపుకున్నారు.
వైసీపీ ఆఫీసు వద్ద కళాకారులు సాంస్కృతిక నృత్యరూపకాలతో ఆకట్టుకున్నారు. ఇక, టీడీపీ ఆఫీసు వద్ద జరిగిన సంబరాల్లో వర్ల రామయ్య వంటి అగ్రనేతలు కూడా పాల్గొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో తమకు మెరుగైన స్థానాలు వచ్చాయంటూ ఇరుపార్టీల కార్యకర్తల ఆనందోత్సాహాలతో అమరావతి ప్రాంతం సందడిగా మారింది.
Advertisement 2
More Telugu News
టీడీపీలో చేరతా: వైసీపీ మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు
11 minutes ago

అశోక్ గజపతిరాజు నన్ను కొట్టలేదు... మంటలు చెలరేగితే నన్ను కాపాడారు: టీడీపీ మహిళా కార్యకర్త
25 minutes ago

Advertisement 3
ఏపీలో కొత్తగా 74 కరోనా పాజిటివ్ కేసులు
1 hour ago

50 శాతం రిజర్వేషన్ల అంశంపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అభిప్రాయాలు కోరిన సుప్రీంకోర్టు
1 hour ago

ఐదు కోట్లా? అసలు ఎవరిస్తారు నాకు?: తాప్సీ
1 hour ago

Advertisement 4