కుటుంబ సభ్యులతో కలిసి 'ఉప్పెన' చిత్రాన్ని వీక్షించిన బాలకృష్ణ
20-02-2021 Sat 21:22
- ఈ నెల 12న రిలీజైన 'ఉప్పెన'
- వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి జంటగా బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా
- 'ఉప్పెన' చిత్రాన్ని ఆస్వాదించిన బాలయ్య
- సినిమా అద్భుతంగా ఉందని యావత్ చిత్రబృందానికి కితాబు

టాలీవుడ్ అగ్రహీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇవాళ హైదరాబాదులో 'ఉప్పెన' చిత్రాన్ని వీక్షించారు. కుటుంబ సభ్యులతో కలిసి 'ఉప్పెన' చిత్రాన్ని ఆద్యంతం ఆస్వాదించారు. సినిమా అద్భుతంగా ఉందంటూ నటీనటులు, దర్శకుడు, ఇతర టెక్నీషియన్లు, నిర్మాతలను అభినందించారు.
ఈ నెల 12న రిలీజైన ఉప్పెన చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్టయింది. ప్రేమకథ కావడంతో యూత్ నుంచి విశేష స్పందన వస్తోంది. లాక్ డౌన్ తర్వాత థియేటర్లు పూర్తిసామర్థ్యంతో నడుస్తున్న నేపథ్యంలో రిలీజైన 'ఉప్పెన'... హౌస్ ఫుల్ గా ప్రదర్శితమవుతోంది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంతో వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో కృతి శెట్టి హీరోయిన్ కాగా, తమిళ నటుడు విజయ్ సేతుపతి కీలకపాత్ర పోషించారు.
Advertisement 2
More Telugu News
ఏపీలో గడచిన 24 గంటల్లో 106 మందికి కరోనా నిర్ధారణ
18 minutes ago

చంద్రబాబు మున్సిపల్ ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఖరారు
28 minutes ago

Advertisement 3
స్టాక్ మార్కెట్: నేడు కూడా లాభాలే!
1 hour ago

'డి కంపెనీ' మోషన్ పోస్టర్ ను పంచుకున్న వర్మ
1 hour ago

82 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడతాం: మోదీ
3 hours ago

Advertisement 4