మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం.. పాల్గొన్న కేసీఆర్, జగన్
20-02-2021 Sat 11:26
- వర్చువల్ విధానంలో సమావేశం
- మమతా బెనర్జీ, అమరీందర్ సింగ్ గైర్హాజరు
- వ్యవసాయం, మౌలిక సదుపాయాలపై చర్చ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం వర్చువల్ విధానంలో ప్రారంభమైంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, పలువురు కేంద్ర మంత్రులతో పాటు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్, సీఈఓ అమితాబ్‌కాంత్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అయితే, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దీనికి గైరుహాజరయ్యారు.
ఈ సమావేశంలో వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, ఉత్పాదక రంగం, మానవ వనరుల అభివృద్ధి, ఆరోగ్యం, పోషకాహారం వంటి వివిధ అంశాలను చర్చిస్తున్నారు. గత ఏడాది కరోనా కారణంగా పాలక మండలి సమావేశం జరగలేదు. చివరిసారిగా 2019 జూన్ లో ఈ సమావేశాన్ని నిర్వహించారు.
Advertisement 2
More Telugu News
50 శాతం రిజర్వేషన్ల అంశంపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అభిప్రాయాలు కోరిన సుప్రీంకోర్టు
15 minutes ago

ఐదు కోట్లా? అసలు ఎవరిస్తారు నాకు?: తాప్సీ
18 minutes ago

తీవ్ర ఒడిదుడుకుల మధ్య లాభాల్లో ముగిసిన మార్కెట్లు
50 minutes ago

Advertisement 3
Advertisement 4