అంతర్వేది రథాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి
19-02-2021 Fri 13:05
- అంతర్వేది లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న జగన్
- స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించిన సీఎం
- 28 వరకు స్వామివారికి కల్యాణోత్సవాలు

తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది లక్ష్మీనరసింహస్వామివారిని ఏపీ ముఖ్యమంత్రి జగన్ దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయం వద్దకు చేరుకున్న జగన్ కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం కొత్తగా తయారు చేసిన రథాన్ని జగన్ ప్రారంభించారు. ఈనెల 28 వరకు స్వామివారి కల్యాణోత్సవాలు జరుగనున్నాయి.
గత ఏడాది సెప్టెంబర్ 5న రథం దగ్ధమైన సంగతి తెలిసిందే. గుర్తు తెలియని దుండగులు రథాన్ని తగలబెట్టారు. ఈ నేపథ్యంలో రూ. 95 లక్షల ఖర్చుతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త రథాన్ని తయారు చేయించింది. రథాన్ని ప్రారంభించే కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కన్నబాబు, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement 2
More Telugu News
ప్రతిపక్ష నేత ఇంటికి కట్టిన తాళ్లే నీ పాలన అంతానికి ఉరితాళ్లు: సీఎం జగన్ పై నారా లోకేశ్ ఆగ్రహం
20 minutes ago

తిరుపతి పర్యటన రద్దు చేసుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా
32 minutes ago

Advertisement 3
ఇప్పటికే ఈటల పని అయిపోయింది.. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత హరీశ్ రావు పని అయిపోతుంది: రేవంత్ రెడ్డి
47 minutes ago

కొరటాల సినిమాలో వరలక్ష్మి కీలక పాత్ర?
2 hours ago

తమిళనాడులో ఊపందుకున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారం.. ప్రభుత్వంపై రాహుల్, స్టాలిన్ ధ్వజం
2 hours ago

Advertisement 4