కేంద్ర మాజీ మంత్రి కెప్టెన్ సతీశ్ శర్మ పాడె మోసిన రాహుల్ గాంధీ
19-02-2021 Fri 11:12
- గాంధీ కుటుంబానికి విధేయుడు కెప్టెన్ సతీశ్ శర్మ
- అనారోగ్యంతో రెండు రోజుల క్రితం గోవాలో కన్నుమూత
- ఢిల్లీలో నేడు అంత్యక్రియలు
- 1947, అక్టోబరు 11న సికింద్రాబాద్లో జన్మించిన సతీశ్ శర్మ

కేంద్ర మాజీ మంత్రి, గాంధీ కుటుంబానికి విధేయుడు కెప్టెన్ సతీశ్ శర్మ (73) అనారోగ్యంతో రెండు రోజుల క్రితం గోవాలో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ రోజు ఆయన అంత్యక్రియలను ఢిల్లీలో జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పాడెను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు పలువురు నేతలు మోశారు.
కాగా, 1947, అక్టోబరు 11న సతీశ్ శర్మ సికింద్రాబాద్లో జన్మించారు. సతీశ్ శర్మకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మొదట ప్రొఫెషనల్ కమర్షియల్ పైలెట్ గా పని చేసిన ఆయన అనంతరం రాజకీయాల్లోకి వచ్చారు. మూడు సార్లు లోక్సభ సభ్యుడిగా, మూడు సార్లు రాజ్యసభ సభ్యుడిగానూ పని చేశారు. ఆయన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు.
Advertisement 2
More Telugu News
మున్సిపల్ ఎన్నికలకు మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలంటూ దాఖలైన రిట్ పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు
44 minutes ago

Advertisement 3
స్టాక్ మార్కెట్: నేడు కూడా లాభాలే!
2 hours ago

'డి కంపెనీ' మోషన్ పోస్టర్ ను పంచుకున్న వర్మ
2 hours ago

Advertisement 4