మధ్యప్రదేశ్లో ఘోర బస్సు ప్రమాదం.. 22 మంది మృతి
16-02-2021 Tue 12:28
- అదుపుతప్పి కాల్వలో పడిన బస్సు
- బస్సులో 60 మంది ప్రయాణికులు
- సురక్షితంగా ఒడ్డుకు వచ్చిన ఏడుగురు
- మృతుల సంఖ్య పెరిగే అవకాశం

మధ్యప్రదేశ్లో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుని 22 మంది మృతి చెందారు. సిధి జిల్లా పట్నా మీదుగా ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి కాల్వలో పడింది. ఆ సమయంలో బస్సులో దాదాపు 60 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు కాల్వలో పడిన అనంతరం ఏడుగురు ప్రయాణికులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.
మిగతా వారికోసం సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రమాదవార్త తెలుసుకున్న స్థానికులు పెద్దఎత్తున అక్కడకు తరలివచ్చారు. ఈ ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
More Telugu News
విదేశీ టీకాలపై దిగుమతి సుంకం తొలిగింపు?
1 hour ago

45 ఏళ్లు పైబడిన సినీ కార్మికులకు, సినీ జర్నలిస్టులకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నాం: చిరంజీవి
3 hours ago

మహారాష్ట్రలో లాక్డౌన్పై రేపే నిర్ణయం!
3 hours ago

మిచెల్లీ ఒబామాతో నా స్నేహాన్ని ఈ విధంగా అర్థం చేసుకోవడం దిగ్భ్రాంతిని కలిగించింది: జార్జ్ బుష్
4 hours ago
