మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. 16 మంది దుర్మరణం
15-02-2021 Mon 09:40
- అరటిలోడుతో వెళ్తున్న ట్రక్కు బోల్తా
- ప్రమాద సమయంలో 21 మంది కార్మికులు
- తీవ్రంగా గాయపడిన మరో ఐదుగురు
- మృతుల్లో ఇద్దరు చిన్నారులు
- బాధితులందరూ జలగావ్ జిల్లా వారే

మహారాష్ట్రలోని జలగావ్ జిల్లాలో గత రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 16 మంది దుర్మరణం పాలయ్యారు. మృతులందరూ కూలీలే. మృతుల్లో 8 మంది పురుషులు, ఆరుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. బాధితులను ఈ జిల్లాలోని అభోడా, కేర్హళ, రావెర్ గ్రామాలకు చెందిన వారిగా గుర్తించారు.
మహారాష్ట్రలోని ధూలే నుంచి రేవర్కు అరటిలోడుతో వెళ్తున్న ట్రక్కు కింగ్వాన్ సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో మొత్తం 21 మంది కార్మికులు ఉన్నారు. ప్రమాదంలో మరో ఐదుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను రూరల్ ఆసుపత్రికి తరలించారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రమాదానికి కారణమైన డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.
More Telugu News
విదేశీ టీకాలపై దిగుమతి సుంకం తొలిగింపు?
4 hours ago

45 ఏళ్లు పైబడిన సినీ కార్మికులకు, సినీ జర్నలిస్టులకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నాం: చిరంజీవి
5 hours ago

మహారాష్ట్రలో లాక్డౌన్పై రేపే నిర్ణయం!
6 hours ago

మిచెల్లీ ఒబామాతో నా స్నేహాన్ని ఈ విధంగా అర్థం చేసుకోవడం దిగ్భ్రాంతిని కలిగించింది: జార్జ్ బుష్
6 hours ago
