కర్నూలు జిల్లాలో ఘోరం... టెంపో, లారీ ఢీకొనగా 14 మంది దుర్మరణం!
14-02-2021 Sun 07:01
- ఈ తెల్లవారుజామున ప్రమాదం
- వెల్దుర్తి మండలం మాదాపురం వద్ద ఘటన
- అదుపుతప్పిన టెంపోను ఢీకొన్న లారీ

కర్నూలు జిల్లాలో ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం 14 మంది ప్రాణాలను బలిగొంది. వెల్దుర్తి మండలం మాదాపురం వద్ద ఈ ఘటన జరిగింది. చిత్తూరు నుంచి హైదరాబాద్ కు వస్తున్న ఓ టెంపో రహదారిపై అదుపు తప్పి, కుడివైపునకు పడిపోగా, ఆ దిశగా వస్తున్న ఓ లారీ టెంపోను ఢీకొంది.
ఈ ప్రమాదంలో 14 మంది మరణించగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. మృతుల్లో ఓ చిన్నారితో పాటు 8 మంది మహిళలు ఉన్నారు. టెంపో డ్రైవర్ నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నామని తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
More Telugu News
భారత ఔషధ అవసరాలను అర్థం చేసుకోగలం: అమెరికా
30 minutes ago

సౌందర్య మరణం కల అయితే బాగుండేది: ఇంద్రజ
35 minutes ago

లక్షణాలు లేకుండానే కరోనా వచ్చి మరణిస్తున్నారన్న ప్రచారాన్ని నమ్మవద్దు: మంత్రి జగదీశ్ రెడ్డి
40 minutes ago

భారీ రేటుకు 'అఖండ' హక్కులు!
1 hour ago

కేసీఆర్ ను కరోనా ఏమీ చేయలేదు: మోహన్ బాబు
2 hours ago

అయిష్టంగానే నాని ఆ కథను విన్నాడట!
2 hours ago

'పుష్ప' విషయంలో తగ్గేదే లేదట!
2 hours ago
