మెరుపు వేగంతో స్పందించి దివ్యాంగుడిని ర‌క్షించిన రైల్వే పోలీసు.. వీడియో ఇదిగో

06-02-2021 Sat 12:22
advertisement

ఓ రైల్వే పోలీసు మెరుపు వేగంతో స్పందించి ఓ దివ్యాంగుడిని ప్రాణాపాయం నుంచి కాపాడాడు. మ‌హారాష్ట్ర‌లోని పాన్వెల్ రైల్వే స్టేష‌న్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.  ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్క‌డి సీసీటీవీ కెమెరాకు చిక్కాయి.  రైలు క‌దులుతుండ‌గా ఓ దివ్యాంగుడు దాన్ని ఎక్క‌డానికి  ప్ర‌య‌త్నించాడు. ఆ స‌మయంలో రైలులోంచి ఓ వ్య‌క్తి  అత‌డిని ప‌ట్టుకుని రైల్లోకి లాగాల‌ని భావించాడు.

అయితే, రైలు వేగంగా క‌దులుతుండ‌డం, అత‌డి కాలు స‌రిగ్గా లేక‌పోవ‌డంతో కింద ప‌డిపోబోయాడు. ఈ విష‌యాన్ని గుర్తించిన అక్క‌డి రైల్వే పోలీసు ప‌రుగున వ‌చ్చి అతడిని ప్లాట్‌ఫాంపైకి లాగాడు. నిన్న మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న‌ చోటు చేసుకుంది. రైలు క‌దులుతోన్న స‌మ‌యంలో ఎక్కాల‌ని చూసిన వ్య‌క్తిపై నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement