మనందరం సమైక్యంగా ఉండాలి.. రైతుల ఉద్యమంపై సచిన్ ట్వీట్

03-02-2021 Wed 21:31
advertisement

రైతుల ఉద్యమంపై ఢిల్లీ అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మనందరం సమైక్యంగా ఉండాలని సచిన్, దేశ సార్వభౌమత్వానికి విఘాతం కలగకూడదని అన్నారు. బయటి శక్తులు ప్రేక్షకుల మాదిరిగానే ఉండాలని, భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని పేర్కొన్నారు.

భారత్ కోసం ఏ నిర్ణయమైనా భారతీయులే తీసుకోవాలని చెప్పారు. పాప్ సింగర్ రిహన్నా, పర్యావరణ ప్రేమికురాలు గ్రెటా థన్ బర్గ్ రైతులకు అనుకూలంగా స్పందించడంతో ప్రపంచ వ్యాప్తంగా ఇది చర్చనీయాంశంగా మారింది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో సైతం రైతులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో సచిన్ స్పందించారు.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement