సామూహిక వివాహ వేడుకల్లో సీఎం మమత స్టెప్పులు... వీడియో ఇదిగో!
02-02-2021 Tue 16:33
- అలీపూర్ దౌర్ జిల్లాలో సామూహిక వివాహ వేడుకలు
- హాజరైన మమతా బెనర్జీ
- గిరిజన కళాకారులతో చేతిలో చేయి వేసి స్టెప్పులు
- నెట్టింట సందడి చేస్తున్న వీడియో

నిరాడంబరతకు మారుపేరుగా నిలిచే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రజల మధ్యన ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. తాజాగా, అలీపూర్ దౌర్ జిల్లా ఫలకటాలో జరిగిన ఓ సామూహిక వివాహ వేడుకలో ఆమె ప్రజలతో కలిసి ఆడిపాడారు.
గిరిజన కళాకారులతో కలిసి స్టెప్పులేస్తూ అందరినీ అలరించారు. నృత్య కళాకారుల చేతిలో చేయి వేసి ఆమె కూడా వారిలో కలిసిపోయి పాదం కదిపారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట సందడి చేస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ శ్రేణులు ఈ వీడియోను విపరీతంగా షేర్ చేస్తున్నాయి.
మమత ఇలా పబ్లిక్ లో ఉల్లాసంగా డ్యాన్స్ చేయడం ఇదే తొలిసారి కాదు. ఇంతకుముందు కోల్ కతాలో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో గిరిజన సంగీత కళాకారిని బసంతి హెంబ్రామ్ తో కలిసి ఆడిపాడారు.
More Telugu News
విడాకుల వరకు తీసుకెళ్లిన బొద్దింకల భయం!
18 minutes ago

ఐసీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షలు వాయిదా
42 minutes ago

టీకా తయారీకి కావాల్సిన ముడిపదార్థాల ఎగుమతులపై నిషేధం ఎత్తివేయండి: అమెరికాను కోరిన అదర్ పూనావాలా
1 hour ago

కరోనా ఉద్ధృతి నేపథ్యంలో అప్రమత్తమైన ఎన్నికల సంఘం.. బెంగాల్లో ప్రచార కార్యక్రమాలపై కఠిన ఆంక్షలు!
1 hour ago

పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలి: చంద్రబాబు
2 hours ago

‘అశోకవనంలో అర్జున కల్యాణం’లో విష్వక్సేన్
3 hours ago
