క్యూబాలో హెలికాప్టర్ ప్ర‌మాదం‌.. ఐదుగురి మృతి

30-01-2021 Sat 09:43
Five Dead In Helicopter Accident In Cuba

క్యూబాలో ఓ హెలికాప్టర్‌ కుప్పకూలిపోయి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆ హెలికాప్ట‌ర్ హెూల్విన్ ప్రావిన్స్‌ నుంచి గ్వాంటనామో ద్వీపానికి వెళ్తుండగా ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంద‌ని అధికారులు తెలిపారు. ఒక కొండపై హెలికాప్టర్‌ ఒక్కసారిగా కూలిపోయిందని వివ‌రించారు.

మృతులకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియలేదని అన్నారు. హెూల్విన్ ప్రావిన్స్‌ నుంచి గ్వాంటనామో ద్వీపానికి  బయల్దేరిన హెలికాప్ట‌ర్ మార్గమధ్యంలో స‌మ‌స్య త‌లెత్త‌డంతో కూలిపోయిందని వివ‌రించారు.

ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలపై  కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ప‌లు వివరాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు.  కాగా, క్యూబాలో 2018లోనూ భారీ విమాన ప్రమాదం జరిగి 112 మంది మృతి చెందారు.


More Telugu News
Sonia Gandhi fires on Union govt
Peddireddy fires on TDP leaders
List of passengers of Crashed army IAF helicopter
Bipin Rawat condition critical
PM Modi emergency cabinet meet on helicopter crash in Tamil Nadu
Helicopter crashes in Tamilnadu
Bipin Rawat IAF helicopter burning video
CDS Bipin Rawat boarded helicopter crashed
Increasing Critical Care facilities in Govt hospitals says Harish Rao
11 YSRCP MLCs takes oath
The Loop Movie Update
Yogi Adityanath will become CM again says ABP CVoter survey
Gamanam movie update
YS Sharmila fires on KCR
Alitho Saradaga Interview
..more