బాబ్రీ మసీదు కూల్చివేతపై కేంద్రమంతి ప్రకాశ్ జవదేకర్ సంచలన వ్యాఖ్యలు
25-01-2021 Mon 06:36
- 6 డిసెంబరు 1992న చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దారు
- బాబర్ వంటి వారు కూల్చివేతకు రామాలయాన్ని ఎంచుకున్నారు
- దేశం ఆత్మ రామమందిరంలో ఉంటుందని వారికి తెలుసు

అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేతతో ఓ చారిత్రక తప్పిదానికి చరమగీతం పాడినట్టు అయిందని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి విరాళాలు ఇచ్చిన వారిని ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ.. 6 డిసెంబరు 1992 న ఓ చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దారని అన్నారు.
బాబర్ వంటి ఆక్రమణదారులు దేశానికి వచ్చినప్పుడు రామాలయాన్ని కూల్చివేతకు ఎంచుకున్నారని అన్నారు. భారతదేశ ఆత్మ రామాలయంలోనే ఉంటుందన్న విషయం వారికి తెలుసని అందుకే వారా పనిచేశారని అన్నారు. రామాలయాన్ని కూల్చివేసి బాబ్రీ మసీదును కట్టారని, అయితే, 1992 డిసెంబరు 6న దానిని కూలగొట్టి జరిగిన చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దారని జవదేకర్ వివరించారు.
Advertisement 2
More Telugu News
మేకిన్ ఇండియాపై అమెరికా అక్కసు!
3 minutes ago

సీక్వెల్ షూటింగ్ మొదలెట్టిన వెంకటేశ్!
27 minutes ago

కుర్రాడి ప్రతిభకు ఫిదా అయిన సచిన్.. వీడియో ఇదిగో!
35 minutes ago

ఉన్న న్యూస్ చెప్పండి... కొత్తగా క్రియేట్ చేయకండి: సినీ నటి సురేఖ వాణి కూతురు ఆగ్రహం
55 minutes ago

Advertisement 3
దేశంలో కొత్తగా 12,286 మందికి కరోనా నిర్ధారణ
3 hours ago

తెలంగాణలో కరోనా కేసుల అప్డేట్స్!
3 hours ago

Advertisement 4