ఎస్వీబీసీ ట్రస్టుకు కోటి రూపాయలు విరాళం అందించిన శాంతా బయోటెక్ చైర్మన్
22-01-2021 Fri 14:11
- శ్రీవారి దర్శనానికి వచ్చిన శాంతా బయోటెక్ అధిపతి
- సతీసమేతంగా స్వామివారి దర్శనం
- ఆలయ సన్నిధిలో డీడీ అందజేత
- విరాళం అందుకున్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

దేశంలో ఉన్న ప్రముఖ ఫార్మా పరిశోధన సంస్థలో శాంతా బయోటెక్ ఒకటి. మానవాళికి ప్రమాదకరంగా పరిణమించిన హెపటైటిస్-బి వ్యాధికి వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసి సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేలా టీకాలను తీసుకువచ్చింది శాంతా బయోటెక్ ఫార్మా సంస్థే. ఈ సంస్థకు అధిపతి తెలుగువాడైన కేఈ వరప్రసాద్ రెడ్డి. ఆయన తాజాగా శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ (ఎస్వీబీసీ) ట్రస్టుకు భారీ విరాళం ప్రకటించారు. ఆ మేరకు కోటి రూపాయల డీడీని ఆయన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అందించారు. శ్రీవారి దర్శనానికి సతీసమేతంగా వచ్చిన శాంతా బయోటెక్ చైర్మన్ వరప్రసాద్ రెడ్డి శ్రీవారి సన్నిధిలో డీడీని అందజేశారు.
Advertisement 2
More Telugu News
మేకిన్ ఇండియాపై అమెరికా అక్కసు!
3 minutes ago

సీక్వెల్ షూటింగ్ మొదలెట్టిన వెంకటేశ్!
27 minutes ago

కుర్రాడి ప్రతిభకు ఫిదా అయిన సచిన్.. వీడియో ఇదిగో!
34 minutes ago

ఉన్న న్యూస్ చెప్పండి... కొత్తగా క్రియేట్ చేయకండి: సినీ నటి సురేఖ వాణి కూతురు ఆగ్రహం
54 minutes ago

Advertisement 3
దేశంలో కొత్తగా 12,286 మందికి కరోనా నిర్ధారణ
3 hours ago

తెలంగాణలో కరోనా కేసుల అప్డేట్స్!
3 hours ago

Advertisement 4