ప్రొద్దుటూరులో కలకలం.. ప్రేమించట్లేదని అమ్మాయిని కత్తితో పొడిచిన యువకుడు
22-01-2021 Fri 13:13
- యువతికి తీవ్రగాయాలపాలు
- ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
- సునీల్ అనే యువకుడు వేధిస్తున్నాడన్న కుటుంబ సభ్యులు
- మూడు నెలలుగా తమ అమ్మాయి వెంట పడుతున్నాడని ఆరోపణ

కడప జిల్లా ప్రొద్దుటూరులో కలకలం చెలరేగింది. ఓ యువతిపై ప్రేమోన్మాది దాడికి పాల్పడ్డాడు. తనను ప్రేమించాలని అమ్మాయిని వేధిస్తోన్న సునీల్ అనే యువకుడు ఈ రోజు ఆ యువతిపై కత్తితో దాడి చేశాడు. ఆ యువతి తీవ్రగాయాలపాలు కావడంతో గుర్తించిన ఆమె కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించారు.
సునీల్ అనే యువకుడు మూడు నెలలుగా తమ అమ్మాయి వెంట పడుతూ వేధిస్తున్నాడని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రేమను అంగీకరించకపోవడంతోనే ఈ దాడికి పాల్పడినట్లు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement 2
More Telugu News
లింగుస్వామి సినిమాలో కృతిశెట్టి.. అధికారిక ప్రకటన!
23 minutes ago

ఉత్పత్తి పెంచాలని ఒపెక్ దేశాలను కోరిన భారత్... గతేడాది చవకగా కొనుగోలు చేసిన చమురు వాడుకోవాలన్న సౌదీ
26 minutes ago

గ్లోబల్ ఉమన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపికైన తెలంగాణ గవర్నర్ కు ఏపీ గవర్నర్ అభినందనలు
45 minutes ago

Advertisement 3
Advertisement 4