ఏపీ కరోనా అప్ డేట్: కొత్తగా 139 మందికి పాజిటివ్
21-01-2021 Thu 16:57
- గత 24 గంటల్లో 49,483 టెస్టులు
- అత్యధికంగా కృష్ణా జిల్లాలో 35 మందికి పాజిటివ్
- అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 3 కేసులు
- యాక్టివ్ కేసుల సంఖ్య 1,522

ఏపీలో గడచిన 24 గంటల్లో కరోనాతో ఒక్క మరణం కూడా సంభవించకపోగా, కొత్తగా 139 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. 49,483 కరోనా పరీక్షలు నిర్వహించగా అత్యధికంగా కృష్ణా జిల్లాలో 35 కొత్త కేసులు వెల్లడయ్యాయి. చిత్తూరు జిల్లాలో 20, గుంటూరు జిల్లాలో 17 కేసులు గుర్తించారు. అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 3, కడప జిల్లాలో 4 కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలో 5, విజయనగరం జిల్లాలో 5 కేసులు గుర్తించారు. అదే సమయంలో 254 మంది వైరస్ ప్రభావం నుంచి కోలుకున్నారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు 8,86,557 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,77,893 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,522 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,142 కరోనా మరణాలు నమోదయ్యాయి.
Advertisement 2
More Telugu News
వాట్సాప్ లో ఫొటో చూసి పెళ్లికి ఓకే చెప్పిన అమ్మాయి... వరుడ్ని ప్రత్యక్షంగా చూసి పెళ్లికి నిరాకరణ
40 minutes ago

బీజేపీ వివాదాస్పద ఎంపీ ప్రగ్యా ఠాకూర్ కు తీవ్ర అస్వస్థత... ఎయిర్ అంబులెన్స్ ద్వారా ముంబయి తరలింపు
1 hour ago

తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ ఇదిగో!
1 hour ago

Advertisement 3
బాలయ్య చేయి చేసుకోవడంపై ఆయన అభిమాని స్పందన!
2 hours ago

ఏపీలో కొత్తగా 115 మందికి కరోనా పాజిటివ్
2 hours ago

భళా భారత్... అహ్మదాబాద్ టెస్టులో ఇంగ్లండ్ పై ఘనవిజయం... వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్స్ చేరిక
3 hours ago

Advertisement 4