ఎయిర్ పోర్టులో సింగర్ హరిహరన్ మెడలోని డైమండ్ నెక్లెస్ మాయం
21-01-2021 Thu 16:18
- రాజస్థాన్ పర్యటనకు వెళ్లిన గాయకుడు హరిహరన్
- సెక్యూరిటీ చెకింగ్ సమయంలో నెక్లేస్ మాయమైనట్టు గుర్తించిన హరిహరన్
- జవహర్ సర్కిల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పోలీసులు

ప్రముఖ సినీ గాయకుడు హరిహరన్ కు చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళ్తే రాజస్థాన్ పర్యటనకు వెళ్లిన ఆయన... పర్యటనను ముగించుకుని ముంబై తిరిగి వెళ్లేందుకు జైపూర్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అయితే, ఎయిర్ పోర్టులో ఆయన మెడలో ఉన్న డైమండ్ నెక్లెస్ మాయమైంది.
ఎయిర్ పోర్టులో సెక్యూరిటీ చెకింగ్ సమయంలో తన మెడలోని నెక్లెస్ మాయమైనట్టు ఆయన గుర్తించారు. వెంటనే అక్కడ ఆయన వెతికినప్పటికీ అది దొరకలేదు. దీంతో తన మేనేజర్ చేతన్ గుప్తాతో కలిసి జవహర్ సర్కిల్ పోలీస్ స్టేషన్ లో ఆయన ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
Advertisement 2
More Telugu News
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు కావొస్తున్న నేపథ్యంలో ఘనంగా ఉత్సవాలు జరపాలన్న సీఎం కేసీఆర్
6 hours ago

విజయవాడలో జరిగింది కుటుంబ స్పర్ధ లాంటిదే... మూడు గంటల్లోనే పరిష్కరించుకున్నాం: నారా లోకేశ్
6 hours ago

10 లక్షల కరెన్సీ నోటు విడుదల చేసిన చిన్నదేశం
6 hours ago

Advertisement 3
Advertisement 4