వయసు 22, చేసుకున్న పెళ్లిళ్లు 12... ఊచలు లెక్కిస్తున్న లవర్ బాయ్!

17-01-2021 Sun 10:21
Police Arrest Youth After 12 Marriages

అతని పేరు గణేశ్. ఉండేది చెన్నైలో. ఫేస్ బుక్ లో చూడటానికి అందంగా ఉంటాడు. లవ్లీ గణేశ్ పేరిట ఫేస్ బుక్ లో ఖాతాను తెరిచి, తన మాయమాటలతో అమ్మాయిలను లవ్ లో పడేసి, వారిని పెళ్లి చేసుకోవడమే ఇతని ప్రవృత్తి. ఒకరిని, ఇద్దరినీ కాదు. ఏకంగా 12 మందిని ఇలా పెళ్లాడాడు. 12వ భార్య ఇతని నిజ స్వరూపాన్ని కనుక్కొని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నాడు.

మరిన్ని వివరాల్లోకి వెళితే, తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా ఓ అమ్మాయితో పరిచయం పెంచుకున్న గణేశ్, ఆమెను పెళ్లాడతానని చెప్పాడు. అమ్మాయి తల్లిదండ్రులు వారి వివాహానికి అంగీకరించలేదు. ఆపై వారు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే, ఇద్దరూ మేజర్లే కావడంతో వారు పెళ్లి చేసుకుని కాపురం పెట్టారు.

కొంతకాలం తరువాత గణేశ్ ప్రవర్తనపై అనుమానం వచ్చిన భార్య ఆరా తీసి, తనకన్నా ముందు అతనికి 11 పెళ్లిళ్లు జరిగాయని తెలుసుకుని షాక్ నకు గురైంది. 11 మందిని అతను మోసం చేశాడని, తాను 12వ దాన్నని తెలుసుకుని, పోలీసులను ఆశ్రయించింది. ఆపై విచారించిన పోలీసులు గణేశ్ ను అరెస్ట్ చేసి, కేసును మరింత లోతుగా విచారిస్తున్నారు.


More Telugu News
Indraja remembers Soundarya
TS Minister Jagadish Reddy condemns rumors on covid deaths
PM Modi wishes Rahul Gandhi a speedy recovery
Will increase Covaxin production says Bharat Biotech
Cinema theaters in Telangana will be closed from tomorrow
Akhanda digital and satellite rights sold for biggest price
Delhi High Court furious on Centre amidst lack of oxygen for corona patients
AP witnessed single day spike in corona new cases
Corona will not do anything to KCR says Mohan Babu
Nani Ignores Tuck jagadeesh story at frist
Amaravathi women JAC wrote Sharmila seeking support
Ward boy rape attempt on Corona patient
Sukumar daring step on shooting Pushpa movie
Prabhas Adipurush updates
KCR and Jagan condolences to the demise of senior journalist Kosuri Amarnath
..more