కరోనా వ్యాక్సిన్ తీసుకువస్తున్న వాహనానికి డప్పులతో స్వాగతం
16-01-2021 Sat 19:27
- భారత్ లో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం
- దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ కోలాహలం
- చత్తీస్ గఢ్ జష్పూర్ లో ఆసక్తికర దృశ్యం
- వ్యాక్సిన్ వాహనానికి ఎదురేగిన ఆసుపత్రి వర్గాలు
- వాహనానికి పూజలు

ఏడాదిగా పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిని పారదోలే క్షణాలు రానే వచ్చాయి. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. కరోనా ఉత్పత్తి కేంద్రాల నుంచి దేశం నలుచెరగులా వ్యాక్సిన్లు రవాణా చేశారు. కాగా, చత్తీస్ గఢ్ లోని జష్పూర్ లో ఆసక్తికర దృశ్యం కనిపించింది. కరోనా వ్యాక్సిన్లను తీసుకువస్తున్న వాహనానికి ఘనస్వాగతం లభించింది.
స్థానిక వైద్య, ఆరోగ్య వర్గాలు బాణసంచా కాల్చుతూ, డప్పు వాయిద్యాలు మోగిస్తూ ఉత్సాహభరిత వాతావరణంలో ఆ వాహనాన్ని ఆసుపత్రికి తీసుకువచ్చారు. అనంతరం ఆ వాహనానికి పూజలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో అందరినీ ఆకట్టుకుంటోంది.
Advertisement 2
More Telugu News
Advertisement 3
తీర్పులను తప్పుబట్టొచ్చు కానీ, న్యాయమూర్తులను దూషించడం సరికాదు: కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్
8 hours ago

ప్రస్తుతం టీమిండియా 90వ దశకం నాటి ఆస్ట్రేలియా జట్టును తలపిస్తోంది: ఇంగ్లండ్ మాజీ పేసర్ డారెన్ గాఫ్
9 hours ago

Advertisement 4