క‌దులుతోన్న రైలు కింద ప‌డ‌బోయిన మ‌హిళ‌ను కాపాడిన పోలీసులు.. వీడియో ఇదిగో

10-01-2021 Sun 12:25
advertisement

రైలు కింద ప‌డ‌బోయిన ఓ మ‌హిళ‌ను పోలీసులు కాపాడారు. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లోని థానే రైల్వేస్టేషన్‌లోని ఐదో నంబర్‌ ప్లాట్‌ఫామ్ వ‌ద్ద చోటు చేసుకుంది. ఓ మ‌హిళ రైల్వే స్టేష‌నులో కదులుతున్న రైలు నుంచి దిగడానికి ప్రయత్నించి,  ప్లాట్‌ఫామ్‌కు, రైలుకు మధ్య పడిపోబోయింది. ఈ విష‌యాన్ని గుర్తించిన రైల్వే పోలీసులు వెంట‌నే ఆమెను బ‌య‌ట‌కు లాగారు.

దీంతో స్వ‌ల్ప‌ గాయాలతో ఆమె ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకుంది.  ఆ మ‌హిళ ప్రాణాల‌ను కాపాడిన‌  ఎస్‌ఐ నితిన్‌ పాటిల్‌, ఏఎస్‌ఐ సత్తార్‌ షేఖ్ ను అధికారులు అభినందించారు. ఈ ప్ర‌మాద దృశ్యాలు రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాలో నిక్షిప్త‌మ‌య్యాయి. ర‌ద్దీగా ఉన్న ఫ్లాట్ ఫామ్ పై ఈ ఘ‌ట‌న చోటు చేసుకోవ‌డంతో అక్క‌డి ప్ర‌యాణికులంతా ఆందోళ‌న చెందారు.


Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement