ఏపీలో పలు గ్రామాలు మున్సిపాలిటీల్లో విలీనం
06-01-2021 Wed 14:38
- మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీల్లోకి కొత్త గ్రామాలు
- ఆర్డినెన్స్ జారీ చేసిన ఏపీ సర్కారు
- మంగళగిరి మున్సిపల్ పరిధిలోకి రానున్న అమరావతి గ్రామాలు
- మౌలిక వసతుల కల్పన కోసమే విలీనం!

రాష్ట్రంలోని పలు గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఇప్పటివరకు మంగళగిరి మండలంలో ఉన్న నవులూరు, యర్రబాలెం, చినకాకాని, నిడమర్రు, నూతక్కి, కాజ, చిన వడ్లపూడి, రామచంద్రాపురం తదితర గ్రామాలను తాజాగా మంగళగిరి మున్సిపాలిటీలో విలీనం చేశారు.
అటు, పెనుమాక, ఉండవల్లి, వడ్డేశ్వరం, ప్రాటూరు, కుంచనపల్లి, కొలనుకొండ గ్రామాలను తాడేపల్లి మున్సిపాలిటీలో కలిపేశారు. పట్టణస్థాయి మౌలిక వసతులు, డ్రైనేజీలు, రోడ్లు, తాగునీరు వంటి ప్రాథమిక సౌకర్యాల కల్పన నిమిత్తం ఆయా గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. ఈ కొత్త ఆర్డినెన్స్ ప్రకారం రాజధాని అమరావతి పరిధిలోని ప్రాంతాలు మంగళగిరి మున్సిపాలిటీ పరిధిలోకి రానున్నాయి.
ADVERTSIEMENT
More Telugu News
చెన్నైతో పోరు... గెలుపు కోసం రాజస్థాన్ అమీతుమీ
39 minutes ago

వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్‌తో కేటీఆర్ భేటీ
45 minutes ago

శుభ్ మాన్ గిల్ కు కోహ్లీ వార్నింగ్... వీడియో ఇదిగో!
58 minutes ago
