సెట్లో రజనీకాంత్ 14 గంటలు.. ఆశ్చర్యపోతున్న యూనిట్!

23-12-2020 Wed 10:17
Rajanikanth works for Fourteen hours per day

తమిళనాట అశేష అభిమానులను సంపాదించుకుని, కొన్ని దశాబ్దాలుగా సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం 'అన్నాత్తే'. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ లాక్ డౌన్ కి ముందు కొంత జరిగింది. ఇప్పుడు మళ్లీ తదుపరి షెడ్యూలు హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో జరుగుతోంది.

గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ షూటింగులో రజనీతో పాటు కథానాయికలు నయనతార, కీర్తి సురేశ్, ఇతర ప్రధాన తారాగణం అంతా పాల్గొంటున్నారు. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుని బయో బబుల్ పరిరక్షణలో ఈ చిత్రం షూటింగును నిర్వహిస్తున్నారు. వచ్చే వేసవిలో తమిళనాట జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో తాను పాల్గొంటున్నందున, ఈ చిత్రాన్ని ఎన్నికలకు ముందుగానే రిలీజ్ చేయాలని రజనీ భావిస్తున్నారు.

ఈ క్రమంలో షూటింగును త్వరగా పూర్తి చేయడానికి ఆయన చాలా కష్టపడుతున్నట్టు తెలుస్తోంది. ఉదయం 6 నుంచి రాత్రి 8 వరకు అంటే రోజుకు 14 గంటల పాటు రజనీ షూటింగు చేస్తున్నారట. సంక్రాంతికి ముందుగానే తన షూటింగు పార్టును పూర్తి చేయాలని ఆయన ఇలా శ్రమిస్తున్నట్టు చెబుతున్నారు. ఓపక్క అనారోగ్య సమస్యలు వున్నప్పటికీ.. ఈ వయసులో ఆయన ఉత్సాహంగా అలా షూటింగ్ చేస్తుంటే యూనిట్ సభ్యులు ఆశ్చర్యపోతున్నారు!


More Telugu News
PM Modi interacts Pradhan Mantri Bala Puraskar awardees
Mahan Movie Updete
Vijayasai Reddy talks to media after meeting with union govt secretaries
Ranga Ranga Vaibhavanga new poster
AP Corona Full Details
NASA explains Tonga volcanic eruption power
Forty two people dead in Afghanistan due to extreme snowfall
Andhra Pradesh employees gives strike notice to govt
Brendan Taylor reveals sensational issue related to fixing
Huge number of police reached Budda Venkanna home to arrest him
Pakistan cricketers leading the way in ICC Awards
Sensex looses 1545 points
BJP was there before birth of Shiv Sena says Devendra Fadnavis
Union minister Kishan Reddy wrote Telangana CM KCR
Kodali Nani is the first person who joins YS Sharmil party in AP says Budda Venkanna
..more