మమతా బెనర్జీ ఫ్యామిలీలో మరో సీఎం లేరు: తృణమూల్ కాంగ్రెస్
20-12-2020 Sun 09:51
- టీఎంసీలో వారసత్వ రాజకీయాలు లేవు
- బీజేపీలోనే బంధుప్రీతి ఉంది
- టీఎంసీ లోక్ సభ నేత కల్యాణ్ బెనర్జీ

మమతా బెనర్జీ కుటుంబంలో వారసత్వ రాజకీయాలు లేవని, ఆమె ఫ్యామిలీలో సీఎం కావాలని కోరుకుంటున్న వారుఎవరూ లేరని తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించింది. తాజాగా బీజేపీలో చేరిన తృణమూల్ రెబల్ నేత సువేందు అధికారి, బంధుప్రీతిపై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, బీజేపీలోనే బంధుప్రీతి ఉందని, తమ అధినేత్రి ఇంట అటువంటిదేమీ లేదని తృణమూల్ కాంగ్రెస్ నేత, లోక్ సభలో ఆ పార్టీ చీఫ్ కల్యాణ్ బెనర్జీ వ్యాఖ్యానించారు.
"సుబేంధు అధికారి రాజకీయాల గురింఃచి మాట్లాడుతున్నారు. ఆయనకు బీసీసీఐ కార్యదర్శి జైషాకు ఉన్న సంబంధం ఏంటి? ఓ కేంద్ర మంత్రి కుమారుడితో ఆయనకున్న బంధుత్వం ఏంటి?" అని ఆయన ప్రశ్నించారు. డైమండ్ హార్బర్ ఎంపీ, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీని తృణమూల్ తదుపరి సీఎంగా ప్రమోట్ చేయాలని నిర్ణయించుకుందని సుబేందు అధికారి ఆరోపించిన నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
More Latest News
ఇది వినడానికే సిగ్గుగా ఉంది: విజయశాంతి
8 hours ago

తెలంగాణలో తాజాగా 477 కరోనా పాజిటివ్ కేసులు
8 hours ago
