మీ కోసం ఎన్ని సార్లు జైలుకు వెళ్లడానికైనా నేను సిద్ధమే: జనరణభేరి సభలో గల్లా జయదేవ్

17-12-2020 Thu 15:33
I am ready to go to jail for Amaravati farmers says Galla Jayadev

తన తాత రాజగోపాల్ నాయుడు స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్లారని... అమరావతి రైతుల కోసం తాను కూడా ఎన్నిసార్లైనా జైలుకు వెళ్లేందుకు సిద్ధమేనని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. టెర్రరిస్టులపై పెట్టే కేసులు అమరావతి రైతులపై పెడుతున్నారని మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడకుండా అమరావతి రైతులు పోరాడుతున్నారని ప్రశంసించారు. అమరావతి ఐదు కోట్ల ఆంధ్రుల రాజధాని అని అన్నారు. అమరావతి రైతులు చేపట్టిన ఉద్యమానికి ఏడాది పూర్తైన సందర్భంగా నిర్వహించిన జనరణభేరి సభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అమరావతికి అండగా ఉన్న తనను కూడా వైసీపీ ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెడుతోందని జయదేవ్ అన్నారు. తమ కంపెనీలను ఇబ్బంది పెట్టేందుకు చాలా చేసిందని, అయినా తాను భయపడటం లేదని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిందేమీ లేదని విమర్శించారు. అప్పులు చేయడం, వాటిని తీర్చడం కోసం ఆస్తులను అమ్ముకోవడం మాత్రమే చేస్తోందని ఎద్దేవా చేశారు.

..Read this also
మంత్రి ఉషశ్రీ వ్యాఖ్యలపై వర్ల రామయ్య మండిపాటు
  • ఎంపీ మాధవ్ వ్యవహారంపై టీడీపీ నేతల విమర్శలు
  • వీడియోపై కేసు నమోదు కాలేదన్న వర్ల
  • వీడియోను ఏ ల్యాబ్ కు పంపలేదని ఆరోపణ
  • మాధవ్ ను కాపాడేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారన్న పట్టాభి


..Read this also
తెలంగాణ‌లో ఒక పార్ల‌మెంటు, 4 అసెంబ్లీ నియోజక వర్గాలకు టీడీపీ ఇంచార్జీల నియామ‌కం... జాబితా ఇదిగో
  • క‌రీంన‌గ‌ర్ పార్ల‌మెంటు పార్టీ అధ్య‌క్షుడిగా వంచె శ్రీనివాస్ రెడ్డి
  • సిరిసిల్ల ఇంచార్జీగా అవునురి ద‌యాక‌ర్ రావు
  • జాబితాను విడుద‌ల చేసిన బ‌క్క‌ని న‌ర్సింహులు

..Read this also
ఏపీ గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన టీడీపీ, కాంగ్రెస్‌, జ‌న‌సేన మ‌హిళ‌లు.. వైసీపీ ఎంపీ గోరంట్ల‌పై ఫిర్యాదు
  • మ‌హిళా జేఏసీ పేరిట రాజ్ భ‌వ‌న్ కు వెళ్లిన 3 పార్టీల ప్ర‌తినిధులు
  • ఎంపీ గోరంట్ల వీడియోపై నిజాలు నిగ్గు తేల్చాల‌ని విన‌తి
  • చ‌ర్య‌ల కోసం విశేషాధికారాలు వినియోగించాల‌న్న మ‌హిళా జేఏసీ


More Latest News
ap minister gummanuru jayaramfires on chandrababu and lokesh
Delhi Boy killed on busy road for urinating on wall
TDP leaders slams YCP govt over Gorantla Madhav issue
Ex NCB officer Sameer Wankhede gets clean chit in certificate case
Amit shah hoists National flag at home
Oscars official page honours Aamir Khans Laal Singh Chaddha in special way
addanki dayakar says sorry to mp komatireddy venkatreddy again
India China relation will be impacted if peace in border areas is disturbed says EAM Jaishankar
lomatireddy venkat reddy rfesponds on revanth reddy sorry
congress chief sonia gandhi tests possitive for corona once again
revanth reddy tests possitive for corona and distance from munugodu padayatra
Cheteshwar Pujara hits in 79 balls Ton In Royal London One Day Cup
Macharla Niyojakavargam movie update
North korea lifts mask mandate after Kim Jong declares covid victory
..more