రేపు ఢిల్లీకి వెళుతున్న ముఖ్యమంత్రి జగన్
14-12-2020 Mon 19:17
- పలువురు కేంద్ర మంత్రులను కలవనున్న జగన్
- రేపు రాత్రి 9 గంటకు అమిత్ షాతో భేటీ
- పోలవరం నిధుల గురించి చర్చించే అవకాశం

ఏపీ ముఖ్యమంత్రి జగన్ రేపు ఢిల్లీకి వెళ్తున్నారు. విజయవాడ నుంచి హస్తినకు ప్రత్యేక విమానంలో వెళ్లనున్నారు. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను జగన్ కలవనున్నారు.
ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆయన భేటీ కీలకమని తెలుస్తోంది. రేపు రాత్రి 9 గంటలకు అమిత్ షాతో భేటీ అయి పలు విషయాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుకు నిధుల గురించి చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈరోజు జగన్ పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన సంగతి తెలిసిందే. పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ తెలియాల్సి ఉంది.
ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఢిల్లీ పర్యటనకు వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ, అమిత్ షాలతో పాటు పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలిశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటి గురించి చర్చించారు.
More Telugu News
ఆక్సిజన్ కోసం వేచిచూడండి అని కరోనా రోగులను అడుగుతారా?: కేంద్రంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం
3 minutes ago

ఏపీలో కరోనా భయానకం... ఒక్కరోజులో 35 మంది మృత్యువాత
25 minutes ago

కేసీఆర్ ను కరోనా ఏమీ చేయలేదు: మోహన్ బాబు
32 minutes ago

అయిష్టంగానే నాని ఆ కథను విన్నాడట!
33 minutes ago

షర్మిల మద్దతు కోరుతూ లేఖ రాసిన అమరావతి మహిళా జేఏసీ
44 minutes ago

గ్వాలియర్ లో దారుణం.. కరోనా పేషెంట్ పై అత్యాచారయత్నం!
46 minutes ago

'పుష్ప' విషయంలో తగ్గేదే లేదట!
1 hour ago

ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమా అప్ డేట్స్!
1 hour ago

కరోనాతో కన్నుమూసిన సీనియర్ పాత్రికేయుడు అమర్ నాథ్... సంతాపం తెలిపిన తెలుగు రాష్ట్రాల సీఎంలు
1 hour ago

తెలంగాణ, ఏపీలకు వర్ష సూచన!
1 hour ago

కరోనా ఎఫెక్ట్ తో యూజీసీ నెట్ వాయిదా
1 hour ago

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
1 hour ago

రాహుల్ గాంధీకి కరోనా పాజిటివ్
2 hours ago
