రజనీకాంత్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సచిన్

12-12-2020 Sat 15:16
advertisement

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సైతం తలైవాకు విషెస్ తెలిపారు. ఈ నేపథ్యంలో, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా తన అభిమాన హీరోకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తలైవా... ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలంటూ ఆకాంక్షించారు. మీకు ఆ భగవంతుడు దీర్ఘాయుష్షును, ఆరోగ్యకరమైన జీవనాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నట్టు సచిన్ ట్వీట్ చేశారు. అంతేకాదు, రజనీతో తాను కలిసి ఉన్న ఫొటోను కూడా పంచుకున్నారు.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement