జనవరి 15 నుంచి హైదరాబాద్ నుంచి అమెరికాకు డైరెక్టు విమాన సర్వీసులు
10-12-2020 Thu 09:16
- 238 సీట్ల సామర్థ్యం కలిగిన విమానంతో సేవలు
- మరిన్ని గమ్యస్థానాలకు విమాన సర్వీసులు అందుబాటులోకి తెస్తామన్న ప్రదీప్ ఫణికర్
- తొలుత హైదరాబాద్-షికాగో మధ్య సేవలు

శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అమెరికాకు నేరుగా విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. వచ్చే నెల 15 నుంచి హైదరాబాద్-షికాగో మధ్య 238 సీట్ల విమాన సేవలు అందుబాటులోకి రానున్నట్టు అధికారులు తెలిపారు. షికాగోకు నేరుగా విమాన సర్వీసులు అందుబాటులోకి రానుండడంపై జీఎంఆర్ విమానాశ్రయ సీఈవో ప్రదీప్ ఫణికర్ హర్షం వ్యక్తం చేశారు.
ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా మరిన్ని గమ్యస్థానాలకు విమానాలు నడిపేందుకు శంషాబాద్ విమానాశ్రయం సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. నిజానికి హైదరాబాద్, అమెరికా మధ్య ఏటా 7 లక్షల మంది ప్రయాణిస్తున్నట్టు అంచనా. అయితే, అందుకు తగ్గట్టుగా విమానాలు అందుబాటులో లేవు. దీంతో నగరం నుంచి అమెరికాకు వెళ్లాలనుకునే వారు కనెక్టింగ్ సర్వీసులతో అమెరికా చేరుకుంటున్నారు.
ADVERTSIEMENT
More Telugu News
కేన్స్ లో పూజా హెగ్డేకి చేదు అనుభవం... ఏం జరిగిందంటే...!
24 minutes ago

ఎన్టీఆర్ కథపై బుచ్చిబాబు కసరత్తు పూర్తి కాలేదట!
52 minutes ago

కోలీవుడ్ యంగ్ హీరో జోడీగా సాయిపల్లవి!
2 hours ago
