తొలి టీ20లో టర్నింగ్ పాయింట్ ఇదే: కెప్టెన్ కోహ్లీ
04-12-2020 Fri 22:07
- ఆసీస్ పై విజయం సాధించిన భారత్
- హార్దిక్ పాండ్య అద్భుత క్యాచ్ పట్టాడన్న కోహ్లీ
- చహల్ పై ప్రశంసలు

కాన్ బెర్రాలోని మనూకా ఓవల్ లో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భారత్ 11 పరుగుల తేడాతో ఆసీస్ పై విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం టీమిండియా సారథి విరాట్ కోహ్లీ మాట్లాడుతూ, కాంకషన్ సబ్ స్టిట్యూట్ గా బరిలో దిగిన స్పిన్నర్ యజువేంద్ర చహల్ విజయంలో కీలకపాత్ర పోషించాడని కొనియాడాడు. అయితే ఆసీస్ కెప్టెన్ ఫించ్ ఇచ్చిన క్యాచ్ ను హార్దిక్ పాండ్య అందుకున్న తీరు అద్భుతమని, మ్యాచ్ ను మలుపు తిప్పింది ఇదేనని స్పష్టం చేశాడు. తుదిజట్టులో లేని చహల్ తమ ప్రణాళికల్లో లేడని, అనూహ్యంగా జడేజా గాయపడడంతో కాంకషన్ సబ్ స్టిట్యూట్ గా వచ్చి అద్భుతంగా బౌలింగ్ చేశాడని చహల్ కు కితాబిచ్చాడు.
Advertisement 2
More Telugu News
ఓడిన కార్పొరేటర్లతో ప్రారంభోత్సవాలా?... ట్రంప్ కు, టీఆర్ఎస్ సర్కారుకు తేడా లేదు: కిషన్ రెడ్డి
1 hour ago

Advertisement 3
కిడ్నాప్ కేసులో అఖిలప్రియ, భార్గవరామ్, గుంటూరు శ్రీను, జగత్ విఖ్యాత్ రెడ్డి కీలకం: పోలీసులు
2 hours ago

ఏపీ కరోనా అప్ డేట్: 161 కొత్త కేసులు, 1 మరణం
4 hours ago

Advertisement 4