నన్ను ఆంధ్రా సెటిలర్లు గెలిపించారు: హైదర్ నగర్ టీఆర్ఎస్ అభ్యర్థి నార్నె
04-12-2020 Fri 18:17
- 2010 ఓట్లతో బీజేపీపై గెలిచిన నార్నె
- కులాలు, మతాలకు అతీతంగా ఓటు వేశారని వ్యాఖ్య
- సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తాం

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదర్ నగర్ డివిజన్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి నార్నె శ్రీనివాస్ గెలుపొందారు. 2010 ఓట్ల మెజార్జీతో బీజేపీ అభ్యర్థిపై జయకేతనం ఎగురవేశారు. నార్నె గెలుపుతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఈ సందర్భంగా నార్నె శ్రీనివాస్ మాట్లాడుతూ, తనపై నమ్మకముంచి గెలిపించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. కులాలు, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా తనకు ఓట్లు వేశారని తెలిపారు. ఆంధ్ర సెటిలర్లే తనను గెలిపించారని చెప్పారు. ప్రచార సమయంలో తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించడంపై దృష్టి సారిస్తానని అన్నారు.
Advertisement 2
More Telugu News
ఓడిన కార్పొరేటర్లతో ప్రారంభోత్సవాలా?... ట్రంప్ కు, టీఆర్ఎస్ సర్కారుకు తేడా లేదు: కిషన్ రెడ్డి
1 hour ago

Advertisement 3
కిడ్నాప్ కేసులో అఖిలప్రియ, భార్గవరామ్, గుంటూరు శ్రీను, జగత్ విఖ్యాత్ రెడ్డి కీలకం: పోలీసులు
2 hours ago

ఏపీ కరోనా అప్ డేట్: 161 కొత్త కేసులు, 1 మరణం
4 hours ago

Advertisement 4